తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో తెలంగాణా లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం పాలక మండలి ఏర్పాటు విషయంలో విధివిధానాలు రూపొందించి సత్వరం చర్యలు చేపట్టాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.యాదగిరిగుట్ట పాలక మండలి నియామకపు నిబంధనలపై సీఎం రేవంత్ ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు అధికారులు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను సూచించారు. యాదగిరిగుట్ట ఆలయ సమీపంలో రాజకీయాలకు తావులేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఈసందర్భంగా సూచించారు. ధర్మకర్తల మండలి నియామకంతో పాటు ఆలయం తరఫున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక, ధార్మిక సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనలకు సీఎం పలు మార్పులు సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం: టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు
By admin1 Min Read
Previous Articleకోహ్లీ రికార్డు దాటిన ఆసీస్ బ్యాటర్ స్మిత్
Next Article మహాకుంభమేళాలో తొక్కిసలాటపై సుప్రీంకోర్టులో పిల్ ..!