భారత అండర్ 19 మహిళల జట్టు టీ20 ప్రపంచ కప్ లో ఫైనల్ చేరింది. తాజాగా నేడు జరిగిన సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 113 పరుగులు మాత్రమే చేయగలిగింది.డేవినా పెరిన్(45), అబి నోర్ గ్రోవ్ (30), అమలు సురేన్ (14) పరుగులు చేశారు. భారత బౌలర్లలో పరునిక సిసోడియా 3 వికెట్లు, వైష్ణవి శర్మ 3 వికెట్లు, ఆయుషీ శుక్లా 2 వికెట్లు పడగొట్టి స్వల్ప పరుగులకే కట్టడి చేశారు. లక్ష్యచేధనలో భారత్ 15 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 117 పరుగులు చేసింది. గొంగడి త్రిష (35), కమిలిని (56 నాటౌట్) పరుగులతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫిబ్రవరి 2న జరుగనున్న ఫైనల్ లో సౌతాఫ్రికాతో తలపడనుంది.
Pic source:BCCI
Previous Articleత్వరలోనే భారత్ సొంత జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్
Next Article బడ్జెట్ ముంగిట లాభాల జోరు..!