ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ నేడు ఢిల్లీలోని ద్వారాక ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు సొంత ఇళ్లు లేదని అయితే ప్రతి పేదవాడికి సొంత ఇళ్లు ఉండాలనేదే తన స్వప్నమని పేర్కొన్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ పై విమర్శలు గుప్పించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీని ఏటీఎంలా మార్చిందని ఆరోపించారు. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఆప్ ప్రభుత్వం కేటాయించడం లేదని కోట్ల రూపాయలతో శీష్ మహాల్ కట్టుకున్న వారికి పేదల బాధలు ఏం తెలుస్తాయని దుయ్యబట్టారు. పేదల సొంతింటి కల సాకారం కావాలంటే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రావాలని అన్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆప్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బీజేపీకి ఢిల్లీ ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరారు.
Previous Articleవారానికి 60 గంటలకు పైగా పని చేయడం ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది: – ఆర్థిక సర్వే
Next Article విశ్వక్ సేన్ “లైలా” చిత్రంలో “కోయ్ కోయ్” సాంగ్..!