శ్రీకాకుళంలో రథసప్తమి ఉత్సవాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల ఉత్సవాల శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ రకాల వేషధారణలు, కోలాటాలు, తప్పెటగుళ్లు, డప్పు వాయిద్యాలు, గిరిజన నృత్యాలు, శకటాలు, ఆట పాటలతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ నింపింది. ఈ 3 రోజుల కార్యక్రమాలు ప్రతి ఒక్కరినీ మరింత ఆనందింప జేయనున్నాయి. రథసప్తమి ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మికత, ప్రశాంతతను ప్రతిబింబించేలా సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సంగిడి రాళ్లు, ఉలవలు బస్తాలు ఎత్తుట, కర్రసాము, కత్తిసాము, పిల్లి మొగ్గలు తదితర గ్రామీణ క్రీడలు, వెయిట్ లిఫ్టింగ్ జిల్లా పోటీలు, రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. గ్రామీణ క్రీడలు, క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు