హిందూపురం మున్సిపాలిటీని తెలుగు దేశం పార్టీ దక్కించుకుంది. మున్సిపల్ ఛైర్మన్ గా 6వ వార్డు కౌన్సిలర్ రమేష్ ఎన్నికయ్యారు. 23 ఓట్లు ఆయనకు వచ్చాయి. ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఓటింగ్ లో పాల్గొన్నారు. 40 మంది సభ్యులు ఉన్న కౌన్సిల్ లో 23 టీడీపీ అభ్యర్థికి 14 వైసీపీ అభ్యర్థికి పడ్డాయి. ముగ్గురు సభ్యులు హాజరు కాలేదు. ఇక నెల్లూరులో డిప్యూటీ మేయర్ గా టీడీపీ అభ్యర్థి తహాసీన్ ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం మున్సిపల్ వైస్ చైర్మన్ గా టీడీపీ మద్దతుదారులు ఎన్నికయ్యారు. తిరుపతి, పిడుగురాళ్ల, నందిగామలలో ఎన్నిక వాయిదా పడింది. సభ నిర్వహణకు అవసరమైన సభ్యులు రాకపోవడంతో ఈమేరకు అధికారులు ప్రకటించారు. ఏలూరు డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీ సభ్యులు ఎన్నికయ్యారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు