దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేటి ట్రేడింగ్ ను నష్టాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో సూచీలు జోరు చూపలేకపోయాయి. కెనడా, మెక్సికో నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం చైనాపై 10 శాతం సుంకం విధిస్తూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 319 పాయింట్లు నష్టపోయి 77,186 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 121 పాయింట్ల నష్టంతో 23,361 వద్ద ముగిసింది. టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, హిందూస్తాన్ యూనీలివర్ షేర్లు నష్టాలతో ముగిశాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ సుజుకి షేర్లు లాభాలతో ముగిశాయి.
ట్రంప్ నిర్ణయం ప్రభావం: నష్టాలతో ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు
By admin1 Min Read