దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ లో భారీ లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు కీలక రంగాల షేర్లు రాణించడంతో సూచీలు దూసుకెళ్లాయి. కెనడా మెక్సికో లపై ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలపడం మార్కెట్లకు కలిసొచ్చింది. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1,397 పాయింట్ల లాభంతో 77,186 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 378 పాయింట్ల లాభంతో 23,739 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.87.10గా కొనసాగుతోంది. టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
Previous Articleఅమెరికా నుండి భారత్ చేరుకున్న అక్రమ వలసదారుల విమానం
Next Article నష్టాలతో ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు