వరుసగా రెండోరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడమే సూచీలు జోరు తగ్గడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 213 పాయింట్లు నష్టపోయి 78,058 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 92 పాయింట్ల నష్టంతో 23,603 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.87.59గా కొనసాగుతోంది. టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకు, హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలతో ముగిశాయి.
Previous Articleఏపీ మంత్రుల పనితీరుపై ర్యాంకింగ్స్: ప్రకటించిన సీఎం చంద్రబాబు
Next Article జొమాటో పేరు మార్పు…!