ప్రముఖ నటుడు సోనుసూద్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి హాజరుకాలేని కారణంగా పంజాబ్‌లోని లుథియానా కోర్టు ఈ ఉత్తర్వులను విడుదల చేసింది.అయితే ముంబయిలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలోని ఒషివారా పోలీస్ స్టేషన్‌కు,లుథియానా జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ రమన్‌ప్రీత్ కౌర్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేశారు.లుథియానా కి చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా,మోహిత్ శర్మ అనే వ్యక్తి తనను ₹10 లక్షలు మోసం చేశాడని కోర్టులో ఫిర్యాదు చేశారు.రిజికా కాయిన్ పేరుతో పెట్టుబడి పెట్టించారని తన వాదన.ఈ కేసులో సోనూసూద్‌ను సాక్షిగా పేర్కొన్నారు.విచారణ చేపట్టిన కోర్టు సోనూసూద్ పై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ,ఆయన హాజరుకాలేదు.దీనితో వెంటనే అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని మెజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 10న జరగనుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు