ప్రముఖ సినీ సంగీత దర్శకుడు థమన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు. వీరితో పాటు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా థమన్ ను చంద్రబాబు సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో థమన్ పంచుకున్నారు. విజనరీ లీడర్, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసిన ఈరోజు ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. తలసేమియా బాధితులకు సాయం అందించేందుకు ఫండ్ రైజింగ్ కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో ఈ నెల 15న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో థమన్ ఆధ్వర్యంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ జరగనుంది. ఈ మ్యూజికల్ నైట్ కోసం పూర్తి సేవా థృక్పథంతో తమన్ తన వంతు సేవా దృక్పథంతో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును థమన్ కలిశారు. థమన్ చేస్తున్న మంచి పనిని సీఎం చంద్రబాబు అభినందించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు