ఆర్థిక మోసాలకు చెక్ పెట్టేందుకు భారతీర రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మనదేశ బ్యాంకుల వెబ్ డొమైన్ ఇక నుండి బ్యాంక్.ఇన్ ఆని కలిగి ఉండాలని, అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు ఫిన్.ఇన్ డొమైన్ ఉండాలని సూచించింది. డిజిటల్ లావాదేవీలులో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలపై విశ్వాసం పెంచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ తెలిపారు. ఈ ఏప్రిల్ నుండి బ్యాంక్.ఇన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఫిన్.ఇన్ రిజిస్ట్రేషన్లు ఉండనున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) దీనికి రిజిస్ట్రార్‌గా వ్యవహరించనుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు