బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హాసీనా వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని భారత్ స్పష్టం చేసింది. ఇటీవల బంగ్లాదేశ్ జాతిపితగా పరిగణించే షేక్ ముజీబుర్ రెహమాన్ చారిత్రాత్మక నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ షేక్ హాసీనా బంగ్లాదేశ్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. వీటిని తీవ్రంగా పరిగణించిన అక్కడ అధికారులు ఢాకాలోని భారత తాత్కాలిక హైకమీషన్ కు సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ తాజాగా స్పందించింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హాసీనా వ్యాఖ్యలు భారత్ కు ఆపాదించడం సరికాదని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ హై కమీషనర్ తో ఇటీవల జరిగిన చర్చలలో ఈ విషయాన్ని స్పష్టం చేశామని తెలిపారు. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హాసీనా వ్యాఖ్యలు భారత్ కు సంపాదిస్తే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని దీనిని బంగ్లాదేశ్ కోరుకోవడం లేదని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు బంగ్లాదేశ్ తాత్కాలిక హై కమీషనర్ కు సమన్లు జారీ చేసినట్లు తెలిపారు.
షేక్ హాసీనా వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం: భారత్ కు ఆపాదించొద్దని బంగ్లాదేశ్ కు కౌంటర్
By admin1 Min Read