తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.గాజాను స్వాధీనం చేసుకుంటామని ఉద్ఘాటించారు.ఈ మేరకు ఆయన స్పందిస్తూ…ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం అమలు చూస్తుంటే సహనం నశిస్తోందని అన్నారు. గాజాలోకి హమాస్ మళ్లీ అడుగుపెట్టకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయం లేకే పాలస్తీనియన్లు శిథిలమైన గాజాలోకి రావాలనుకుంటున్నారని తెలిపారు.అయితే గాజాలో ఉన్న పాలస్తీనియన్లను మరో ప్రాంతానికి తరలిస్తామని… అనంతరం గాజాలోకి అమెరికా బలగాలను దింపి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని ట్రంప్ చెప్పారు.గాజాలో పాలస్తీనియన్ల కోసం మంచి ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు.గాజాను స్వాధీనం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని డోనాల్డ్ ట్రంప్ అన్నారు.
Previous Articleరాజ్యాంగం ఇచ్చిన హక్కులను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Next Article ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ ట్రైలర్ విడుదల