దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు ప్రభావం చూపాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తామని చేసిన వ్యాఖ్యలు కూడా మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది. ఇక ఇన్వెస్టర్ల సంపదగా భావించే బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ లో రిజిస్టర్డ్ కంపెనీల విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు ఆవిరైంది. నేటి ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 548 పాయింట్లు నష్టపోయి 77,311గా స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 178 పాయింట్లు నష్టంతో 23,381 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.87.46గా కొనసాగుతోంది. భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా షేర్లు లాభాలతో ముగిశాయి.
Previous Articleఫ్రాన్స్, అమెరికా పర్యటనల కోసం బయలుదేరి వెళ్లిన ప్రధాని మోడీ
Next Article ‘స్పిన్నర్’ అనే పేరుతో రిలయన్స్ స్పోర్ట్స్ డ్రింక్స్