వరుసగా ఐదో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో సూచీలు నేల చూపులు చూశాయి. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ నిర్ణయాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో సూచీలు నష్టాలతో ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1,018 పాయింట్లు నష్టపోయి 76,293గా స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 310 పాయింట్లు నష్టంతో 23,071 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.87.82గా కొనసాగుతోంది. భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాలతో ముగిశాయి.
Previous Article‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్ …!
Next Article అస్వస్థతకు గురైన పృథ్వీరాజ్…!