తాజాగా ఏపీ లో కూటమి ప్రభుత్వం విఐపిల భద్రత మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. 10 కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను 9.2 కోట్లతో సిద్ధం చేస్తూ, వాటికి సంబంధించిన ఉత్తర్వులను హోంశాఖ జారీ చేసింది, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు వీఐపీల భద్రత కొరకు నూతన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది.
10 ఫార్చునర్ టయోటా వాహనాలను, బుల్లెట్ ప్రూఫ్ గా మార్చాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ నేపథ్యంలో అధికార పెద్దలకు అన్నివేళలా దృఢమైన భద్రత కల్పించేందుకు తాజాగా ఏపీ సర్కార్ ఈ నిర్ణయం చేపట్టింది.