దేశవ్యాప్తంగా మోడీ వేవ్, చరిష్మా ఎంత మాత్రం తగ్గలేదని మరోసారి స్పష్టమవుతోంది. దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ సొంతంగా 41 శాతం ఓట్లతో 281 సీట్లు సాధిస్తుందని ‘మూడ్ ఆఫ్ ది నేషన్ ‘ పోల్ తెలిపింది. కాంగ్రెస్ కు సొంతంగా 78 సీట్లు మాత్రమే వస్తాయని ఇతరులు 184 సీట్లు సాధిస్తారని పేర్కొంది. ఎన్డీయే 343 స్థానాలు కైవసం చేసుకుంటుందని ఇండియా కూటమి 188 సీట్లకు పరిమితమవుతుందని వెల్లడించింది. ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ మినహా మహారాష్ట్ర, హార్యానా తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయాన్ని నమోదు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి తిరుగులేదని మరోసారి స్పష్టంగా తెలుస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Previous Articleభారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణా రంగంలో దూసుకెళ్తోంది..!
Next Article నితిన్ “రాబిన్ హుడ్” నుండి సరికొత్త అప్డేట్ …!

