తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.ఈ మేరకు ఆయనకు ఏపీ ఉ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ …”తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, నరంతర శక్తితో మరెన్నో సంవత్సరాల పాటు ప్రజా సేవలలో గడపాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు 71వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా…తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.గజ్వేల్ నియోజకవర్గం శాసనసభ్యులు,మాజీ సీఎం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం తెలిపారు.
Heartfelt birthday wishes to the former Chief Minister of Telangana and President of the @BRSparty, Sri Kalvakuntla Chandrashekar Rao (KCR) Garu. May you be blessed with good health, happiness, and continued strength to serve the people for many more years – @PawanKalyan@KTRBRS…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) February 17, 2025