ఏపీ సీఎం చంద్రబాబు కృషి వల్లనే రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు పెరిగాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉందని గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఏడు నెలలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహాకారం అందించిందని పేర్కొన్నారు. నేడు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగా జల్ జీవన్ మిషన్ లో రూ.15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. సీఎం చంద్రబాబు విజ్ఞప్తితో కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని మరో సంవత్సరం పొడిగించిందని తెలిపారు. ప్రస్తుతం నిధుల సమీకరణకు గత ప్రభుత్వం చేసిన తప్పులు అడ్డంకులు గా ఉన్నాయని పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు కృషి వల్లనే రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు పెరిగాయి: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
By admin1 Min Read

