ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై కీలక వ్యాఖ్యలు చేసింది. వీటి వేదికగా చేస్తున్న పోస్టుల వ్యవహారంలో వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జి సజ్జల భార్గవ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన సందర్భంలో హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. వీటి వేదికగా చేస్తున్న అసభ్యకర పోస్టులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని తమ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు చట్టం అనుమతిస్తుందన్న కారణంతో వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసభ్య పోస్టులు పెట్టడానికి వీల్లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టుల నిరోధానికి ఏవిధమైన చర్యలు తీసుకుంటున్నారో సంబంధించిన వివరాలు తమ ముందుంచాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.
Previous Articleగ్రూప్-2 అభ్యర్థులు ఆందోళనలు చేస్తుంటే వారి విజ్ఞప్తి పట్టించుకోరా?: ఏపీసీసీ చీఫ్ షర్మిల
Next Article భాష కోసం తమిళులు ప్రాణాలు కోల్పోయారు: కమల్ హాసన్