నల్గొండ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. జరిగిన ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలీకాప్టర్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు.
నల్గొండ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం… దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
By admin1 Min Read
Previous Articleతమన్నా “ఓదెల-2” టీజర్ విడుదల…!
Next Article మహిళల కోసం సురక్ష యాప్ :- ఏపీ హోంమంత్రి అనిత