అన్నమయ్య జిల్లాలో ఏనుగులు దాడిలో ముగ్గురు మరణించారు. ఓబులవారి పాలెం గుండాల కోన వద్ద భక్తుల పై దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతి చెందగా…మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రేపు శివరాత్రి సందర్భంగా భక్తులు ఆలయానికి నడిచి వెళ్తుండగా ఏనుగులు వారిపై దాడి చేశాయి. ఈ దాడిలో ముగ్గురు భక్తులు మరణించడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినట్లు వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఘటన బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించాలని తమ పార్టీ నేతలకు, అలాగే ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.
అన్నమయ్య జిల్లాలో ఏనుగులు దాడి… ముగ్గురు మృతి… సీఎం డిప్యూటీ సీఎం దిగ్బ్రాంతి
By admin1 Min Read