దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సీట్లు తగ్గుతాయనే ప్రచారానికి తెర పడే విధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టతనిచ్చారు. స్థానాలు తగ్గవని చెప్పారు. ఇషా సెంటర్ లో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ఆయన తమిళనాడులోని కోయంబత్తూరుకు వచ్చిన అమిత్ షా స్థానిక బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు సీఎం ఆయన కుమారుడు ప్రజల్లో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ ఇచ్చిన హామీ ప్రకారం దక్షిణాది రాష్ట్రాలకు ప్రోరేటా విధానంలో ఒక్క సీటు కూడా తగ్గదని తాము దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు. నిధుల కేటాయింపులో తమిళనాడుకు అన్యాయం జరుగుతుందన్న విమర్శలను తిప్పికొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం గత పదేళ్లలో రూ.5 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చినట్లు తెలిపారు. తమిళనాడుకు అన్యాయం చేసింది అప్పటి యూపీఏ ప్రభుత్వమని విమర్శించారు. డీఎంకే పైనా విమర్శలు గుప్పించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మహారాష్ట్ర, హార్యానా కంటే ఘనవిజయాన్ని సాధించి తమిళనాడులో అధికారం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వబోం: ఒక్క సీటు కూడా తగ్గదు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
By admin1 Min Read