అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు డిస్ట్రిక్ట్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది.ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు అంశంలో ట్రంప్ నిర్ణయానికి డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ బ్రేకులు వేశారు.భారీ సంఖ్యలో ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తూ…ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేశారు.ఈ క్రమంలో అమెరికాలో ఫెడరల్ ఏజెన్సీల్లో ఉద్యోగులను తొలగించాలన్న ప్రభుత్వ చట్టవిరుద్ధమైన ఆదేశాలపై పలు యూనియన్లు, న్యాయవాద సంఘాలు దావా వేశాయి.దీనిపై తాజాగా యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణ జరిగింది.ఈ సందర్బంగా డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ తీర్పును వెలువరించారు.అధ్యక్షుడి నిర్ణయాన్ని నిలిపివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.పర్సనల్ మేనేజ్‌మెంట్ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు.తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. ఈ తీర్పుతో ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు