ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆశా వర్కర్లకు శుభవార్త చెప్పింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. వయోపరిమితి పెంపు, వేతనంతో కూడిన ప్రసూతి సెలవు, గ్రాట్యుటీ మంజూరు చేశారు. ఆశా వర్కర్ల గరిష్ఠ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచింది. అలాగే ఆశా వర్కర్లందరికీ లబ్ధి చేకూరేలా గ్రాట్యుటీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి 2 ప్రసవాలకు ఇకపై 180 రోజులు వేతనంతో కూడిన సెలవులు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. వ్యాప్తంగా దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. వీరిలో గ్రామాల్లో 37,017 మంది పట్టణాల్లో 5,735 మంది ఉన్నారు. ప్రస్తుతం వారికి నెల జీతం కింద రూ. 10 వేలు అందుతోంది. ఇక సర్వీసు ముగింపులో గ్రాట్యుటీ కింద రూ. 1.5 లక్షలు దాకా పొందే అవకాశం ఉంటుంది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

