వైసీపీ నేతలకు హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు .ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నారు. అనంతపురంలో జరిగిన ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్ లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. తమ పార్టీలో అంతర్యద్ధం ఏమీ లేదన్న ఆమె వైసీపీ నేత మాధవ్ ముందు అతని పార్టీలో ఉన్న అంతర్యుద్ధం సంగతి చూసుకోవాలని హితవు పలికారు. చేసిన తప్పుకు శిక్ష నుండి తప్పించుకోలేరని పోసానికి స్ర్కిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది ఆయనేనని అన్నారు. ఆయన మాట్లాడిన మాటలు వలనే కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఏది పడితే అది మాట్లాడితే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రెడ్బుక్ ప్రకారం మేము ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడ్డుపై తిరగలేరుని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. మేం కక్షపూరితంగా కాదు..చట్టపరంగా వెళ్తున్నామని ఆమె స్పష్టం చేశారు. హద్దు మీరి మాట్లాడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ట్రైనీ ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్ కు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి మంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల రక్షణే లక్ష్యంగా సేవలందించడానికి 395 మంది ఎస్సైలుగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. అందులో 300 మంది సివిల్ ఎస్సైలు, 94 మంది ఏపీఎస్పీ ఎస్సైలు ఉండగా.. ఒకరు ఏఆర్ ఎస్సైగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇందులో 97 మంది మహిళా ఎస్సైలు ఉండటం గర్వించే విషయమని అన్నారు. మీరంతా అకుంఠిత దీక్షతో, నిజాయితీగా ప్రజల రక్షణకై ముందుండాలని హోం మంత్రి అనిత ఆకాంక్షించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు