ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ప్రముఖ పవిత్ర జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం సోమ్ నాధ్ దేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సోమ్ నాధ్ లింగానికి పూజలు చేశారు. అనంతరం ఆసియా సింహాలకు ఆవాసమైన జునాఘడ్ జిల్లాలోని గిర్ వన్యప్రాణుల అభయారణ్య కేంద్రం సాసన్ లో పర్యటించారు. నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా అక్కడ జరిగే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. జామ్ నగర్ జిల్లాలోని జంతు సంరక్షణ పునరావాస కేంద్రం వన్ తారాను సందర్శించారు.
Previous Articleబాలయోగి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం: ఏపీ సీఎం చంద్రబాబు
Next Article ‘చావా’ తెలుగు ట్రైలర్ విడుదల..!