సినీ నటుడు పోసాని కృష్ణమురళిని వరుసుగా కేసులు నమోదు అవుతున్నాయి.ఏపీ సీఎం చంద్రబాబు ,ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,ఆయన కుటుంబ సభ్యులను దూషించిన కేసులో ఇప్పటికే ఆయన రిమాండ్ లో ఉన్నారు.ఈ కేసులో భాగంగా రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.అయితే పోసానిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి.
పోసాని అదుపులోకి తీసుకునేందుకు మిగిలిన పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు.మరోవైపు నరసరావుపేట,అల్లూరి జిల్లా,అనంతపురం పోలీసులు రాజంపేట జైలు అధికారికి పీటీ వారెంట్లు అందించారు.ఈ మేరకు తాము కోర్టు అనుమతి తీసుకున్నామని,ముందుగా పోసానిని తమకే అప్పగించాలని నరసరావుపేట పోలీసులు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

