భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చాలా లావుగా ఉన్నాడని,ఆయన బరువు తగ్గాల్సిన అవసరం ఉందని,ఆయనది ఆకట్టుకునే ఆకారం కాదని,అతను ఒక సాధారణ ఆటగాడని మాజీ స్పోర్ట్స్ జర్నలిస్ట్,కాంగ్రెస్ మహిళా నాయకురాలు షామా మహ్మద్ చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.తాజాగా కాంగ్రెస్ నేత షామా మహ్మద్ కామెంట్స్‌పై బీజేపీ కౌంటర్ ఎటాక్ చేసింది.
అయితే కాంగ్రెస్ పార్టీ 90 ఎన్నికల్లో ఓడిపోయినా రాహుల్‌గాంధీ కెప్టెన్సీ మిమ్మల్ని ఆకట్టుకుంది గానీ,రోహిత్ శర్మ కెప్టెన్సీ మాత్రం ఆకట్టుకునేలా లేదా..? అని నిలదీశాడు.రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసే మీకు కెప్టెన్సీ గురించి ఏం తెలుస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి ప్రశ్నించారు.రాహుల్ గాంధీ కెప్టెన్సీలో ఢిల్లీ ఎన్నికల్లో 3 సార్లు డకౌట్ అయినవాళ్లు రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మాట్లాడటం సిగ్గుచేటని మరో బీజేపీ నేత షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు.

