వనతారా అభయారణ్యాన్ని ప్రధాని మోడీ నేడు ప్రారంభించి అందులో పర్యటించారు. దేశంలోనే అత్యంత ధనవంతుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి వన్య ప్రాణుల పట్ల కలిగిన అమితమైన ప్రేమకు ప్రతిరూపం ఈ వనతారా కృత్రిమ అభయారణ్యం. గుజరాత్ లోని జామ్ నగర్ వద్ద ఉన్న 3 వేల ఎకరాల స్థలంలో అనంత్ అంబానీ ఒక అద్భుతమైన అరణ్యాన్ని సృష్టించారు. ఇక్కడ వివిధ రకాల జంతు జాతులు, పక్షులు అత్యంత అద్భుతమైన జీవవైవిధ్యంతో జీవనం సాగిస్తున్నాయి. గాయపడిన, వ్యాధుల బారిన పడిన జంతువులకు, పక్షులకు చికిత్స అందిస్తూ, వాటిని జాగ్రత్తగా ఇక్కడ కాపాడుతుండడం హార్షణీయం. అనేక రకాల జంతుజాలనికి ఇది పునరావాస సంరక్షణ గా నిలుస్తోంది.
తాజాగా వనతారా ఆరోగ్యాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ఎన్ క్లోజర్లలో ఉన్న పులులను, సింహాలను ఆసక్తిగా తిలకించారు. ఏనుగులు, జిరాఫీలు, జీబ్రాలు, హిప్పోలకు ఆహారం అందించారు. పులులు, సింహాల కూనలకు స్వయంగా పాలు తాగించారు. అనంత్ అంబానీ స్వయంగా ప్రధానికి ఈ కృత్రిమ అరణ్యంలోని ప్రత్యేకతలు, విశేషాలు వివరించారు. వనతారా సెంటర్ డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందితో ప్రధాని మోడీ ముచ్చటించారు. ఇక మోడీ ఇక్కడ పర్యటనకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
Inaugurated Vantara, a unique wildlife conservation, rescue and rehabilitation initiative, which provides a safe haven for animals while promoting ecological sustainability and wildlife welfare. I commend Anant Ambani and his entire team for this very compassionate effort. pic.twitter.com/NeNjy5LnkO
— Narendra Modi (@narendramodi) March 4, 2025