రాష్ట్రంలో సీజనల్ హాస్టళ్ల పనితీరును మెరుగుపరుస్తామని శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. యువగళం పాదయాత్ర ఆలూరు, ఆదోనిలో కొనసాగుతున్నపుడు కుటుంబాలు మూకుమ్మడిగా వలసలు వెళ్లడం చూశానన్న ఆయన అవన్నీ చూశాక ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిచేసి.. సాగు, తాగునీరు ఇస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. డీఎస్సీలో కర్నూలుకు ఎక్కువమంది ఉపాధ్యాయులు రాబోతున్నారు. సీజనల్ హాస్టల్స్ కు సంబంధించి కేవలం భోజనం పెట్టడానికి మాత్రమే అవకాశం ఉంది, హాస్టళ్లలో వసతులు లేవు. కరువు ప్రాంతాల్లో ప్రజలు వేరేచోటకు వలసలు వెళ్లిన సమయంలో అక్కడ అడ్మిషన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. రాబోయే మూడేళ్లలో సీజనల్ హాస్టళ్ల పనితీరులో మార్పు తెస్తామని తెలిపారు. ఇక రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు