ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకుడు సురేష్ భయ్యాజీ జోషి వ్యాఖ్యలపై మాజీ సీఎం, శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు.ఈ మేరకు ఆయన విధాన్ భవన్ కాంప్లెక్స్‌లో విలేకరులతో మాట్లాడుతూ…జోషి వ్యాఖ్యల వెనుక ఆర్‌ఎస్‌ఎస్ రహస్య అజెండా ఉందని విమర్శించారు.ముంబైని చీల్చడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఉద్దవ్ ఆరోపించారు. ఇవే మాటలు గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్‌లో అని క్షేమంగా వెనక్కు రాగలరా అంటూ జోషిని ఠాక్రే సవాలు చేశారు.కాగా మరాఠీ మనుషులు స్వాగతిస్తున్నారని ఏది పడితే అది మాట్లాడితే…ఇక్కడ ఎవరూ సహించరని హెచ్చరించారు. జోషిపై దేశద్రోహం కేసును నమోదు చేయాలని ఉద్దవ్ ఠాక్రే డిమాండు చేశారు.
ముంబైని చీల్చడానికి బీజేపీ కుట్ర పన్నింది:-శివసేన(యూబీటీ) అధినేత ఉద్దవ్ ఠాక్రే
By admin1 Min Read