ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు అనువైన ప్రాంతమని విదేశీ పర్యటనలో ఉన్న ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వివిధ దేశాల ప్రతినిధులకు ఆహ్వానం పలికారు.బెర్లిన్ ఐటీబీ – 2025 సదస్సులో భాగంగా 3వ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన పర్యాటక స్టాల్ వద్దకు వివిధ దేశాల ప్రతినిధులను ఆహ్వానించి ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పెట్టుబడులకు ఇదే సరైన సమయమని వివరించారు . నూతన ఆవిష్కరణలను పారిశ్రామికవేత్తలకు స్పష్టంగా వివరించారు. నూతన పర్యాటక పాలసీ, రాష్ట్ర పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచారాన్ని తెలిపే పుస్తకాలను విదేశీ ప్రతినిధులకు మంత్రి పంపిణీ చేశారు. అంతకుముందు పలువురు ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి అవకాశాలు మరియు వనరుల గురించి వివరించారు.
పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం…వివిధ దేశాల ప్రతినిధులకు మంత్రి దుర్గేష్ ఆహ్వానం
By admin1 Min Read