ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఈడీ మొదటి సెమిస్టర్ ఎగ్జామ్ పేపర్ లీకైంది.ఈ లీకేజి అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బిఎడ్ పరీక్షా పత్రం లీకేజి అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. మధ్యాహ్నం 2.గంటలకు జరగాల్సిన ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్‍మెంట్ పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం నిర్ణీత సమయానికి ముందే లీక్ కావడంపై విచారణ నిర్వహించాల్సిందిగా ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అలాగే పరీక్షను రద్దుచెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇటువంటి సంఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయి. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులను కోరారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు