మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలను నేడు ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. సుదూర ప్రాంతాల నుండి ఎయిమ్స్ హాస్పటల్, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రజలు రాకపోకలకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు మంత్రి లోకేష్ దృష్టికి రావడంతో ఆయన విజ్ఞప్తి మేరకు మెగా ఇంజనీరింగ్ సంస్థ సిఎస్ఆర్ నిధుల నుండి రూ.2.4 కోట్ల విలువైన రెండు ఒలెక్ట్రా బస్సులను ఉచితంగా అందించింది. ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండు నుండి ఎన్ఆర్ఐ జంక్షన్, డిజిపి ఆఫీసు మీదుగా ఎయిమ్స్ కు, మరొకటి మంగళగిరి బస్టాండు నుండి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాలస్వామి గుడివరకు ఉచితంగా ప్రజలకు సేవలు అందిస్తాయని లోకేష్ పేర్కొన్నారు.
ఉచితంగా ప్రజలకు సేవలు అందించే రెండు ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన మంత్రి లోకేష్
By admin1 Min Read