అధికారంలో వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం… ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్తుందని మాట తప్పి మోసం చేయడం అంటే ఇదేనని సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా విమర్శలు గుప్పించారు. తమ గోడు వినిపించాలనుకున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. వారి గొంతు నొక్కి, ఆందోళలను అణిచివేయడం కూటమి ప్రభుత్వ నియంత చేష్టలకు పరాకాష్టని దుయ్యబట్టారు.
అంగన్వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవి. వెంటనే వారిని పిలిచి ప్రభుత్వం చర్చించాలని అన్నారు. అంగన్వాడీలకు నెలకు గౌరవ వేతనం రూ.26వేలు ఇవ్వాలని తక్షణం గ్రాట్యూటి చెల్లింపు హామీని అమలు చేయాలని పేర్కొన్నారు. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా పరిగణించాలి. హెల్పర్ల పదోన్నతిపై నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. పెండింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. విధి నిర్వహణలో అంగన్వాడీలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగంతో పాటు మట్టి ఖర్చుల కింద రూ.20వేలు ఇవ్వాలి. వీటితో పాటు ఇతర 12 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని సీఎం చంద్రబాబు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడీల డిమాండ్లు న్యాయబద్ధమైనవి…వారిని పిలిచి ప్రభుత్వం చర్చించాలి: వైఎస్ షర్మిల
By admin1 Min Read