కాలానుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తూ ముందుకు దూసుకెళ్తోంది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో). తాజాగా ‘స్పేడెక్స్ డీ డాకింగ్’ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించడం పట్ల కేంద్ర మంత్రి ఇస్రో కు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా శాటిలైట్స్ ను స్పేస్ లోనే అనుసంధానం చేసే మిషన్ ను ఇస్రో చేపట్టిన సంగతి తెలిసిందే. మున్ముందు కూడా భారీ అంతరిక్ష ప్రయోగాల్లో అవసరమైన ఈ కీలక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న ఇస్రో ఆ వైపుగా మరో కీలక ముందడుగు వేసింది. తాజాగా స్పేడెక్స్ డీ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించింది. దీనిపై కేంద్ర శాస్త్ర సాంకేతిక రంగ మంత్రి జితేంద్ర సింగ్ ఇస్రో కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి భారతీయుడిలో ఈ విజయం ఉత్సాహం నింపుతోంది. భారతీయ అంతరిక్ష కేంద్రం చంద్రయాన్ -4, గగన్ యాన్ సహా భవిష్యత్తు ప్రయోగాలకు మార్గం సుగమం చేసిందని పేర్కొన్నారు.
‘స్పేడెక్స్ డీ డాకింగ్’ ప్రక్రియ విజయవంతం… ఇస్రో కు కేంద్ర మంత్రి అభినందనలు
By admin1 Min Read
Previous Articleసిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ నుండి క్రేజీ అప్డేట్
Next Article ప్రపంచ అత్యంత కాలుష్య నగరాల్లో భారత్ ఆధిక్యం..!