గుంటూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ట్రిపుల్ ఎక్స్ సోప్స్ అధినేత అరుణాచలం మాణిక్యవేల్ (77) నిన్న సాయంత్రం కన్నుమూశారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.1980లలో గుంటూరుకు వచ్చి,సబ్బుల వ్యాపారం ప్రారంభించిన మాణిక్యవేల్, ఇంటింటికి తిరిగి సబ్బులు విక్రయిస్తూ ఎదిగారు. ఫ్యాక్టరీ స్థాపించి, ట్రిపుల్ ఎక్స్ సోప్స్ బ్రాండ్‌ను ప్రజాదరణ పొందేలా చేశారు. “ట్రిపుల్ ఎక్స్.. సంస్కారవంతమైన సోప్” అనే ప్రకటన ఎంతగానో ప్రాచుర్యం పొందింది. సాంస్కృతిక, సేవా సంస్థలకు ఆర్థిక సహాయం అందించిన ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.నేడు గుంటూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

