కొలంబియా యూనివర్సిటీలో భారత విద్యార్థిని రంజని శ్రీనివాసన్ స్వచ్ఛందంగా అమెరికాను వదిలిపెట్టారు.పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొన్న కారణంగా ఆమె వీసాను మార్చి 5న యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ రద్దు చేసింది.ఆమె హింస, ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నారనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నారని సమాచారం.మార్చి 11న స్వీయ బహిష్కరణ ప్రక్రియను పూర్తి చేసి స్వదేశానికి తిరిగి వెళ్లారు.అమెరికా అధికారులు మిలటరీ విమానంలో పంపకుండా ముందస్తుగా ఆమె జాగ్రత్తలు తీసుకున్నారు.హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ ఆమె విమానాశ్రయంలో ఉన్న వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు.రంజని అర్బన్ ప్లానింగ్‌లో రీసెర్చ్ విద్యార్థిగా చదువుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె అహ్మదాబాద్ సీపీఈటీ యూనివర్సిటీలో బ్యాచిలర్స్ చదివారు.
పాలస్తీనా నిరసనల్లో పాల్గొన్న భారత విద్యార్థి వీసా రద్దు చేసిన అమెరికా
By admin1 Min Read