తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది.వారాంతపు సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు.స్వామివారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని ఆలయ అధికారులు తెలిపారు.టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు 18 గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు.నిన్నటి రోజున శ్రీ వేంకటేశ్వర స్వామిని 82,580 మంది భక్తులు దర్శించుకోగా, 31,905 మంది తలనీలాలు సమర్పించారు.భక్తుల కానుకల ద్వారా హుండీకి రూ. 4 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
Previous Articleకోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి: విజయసాయిరెడ్డి ఆసక్తికర పోస్ట్
Next Article ఇకపై ‘మాజీ భార్య’ అని పిలవకండి…!