ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకువచ్చిన వాట్సాప్ ఈ-గవర్నెన్స్ సేవలు ‘మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్” ఈ నెలాఖరుకు 300 సర్వీసులను ప్రభుత్వం తీసుకువస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. వాట్సాప్ ఈ-గవర్నెన్స్ ద్వారా 200 రకాల పౌరసేవలు అందించగలుగుతున్నామని, సర్టిఫికెట్ల జారీ ఎంతో సులభంగా మారిందని వివరించారు. గతంలో చంద్రబాబు పౌరసేవలను ఈ-సేవగా మార్చి ప్రజలకు వద్దకు పాలన తీసుకువెళ్లారని గుర్తు చేశారు. తాను గతేడాది నిర్వహించిన యువగళం పాదయాత్ర ద్వారా, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా అర్థం చేసుకున్నానని పేర్కొన్నారు. ప్రజల కోసం సులభతరంగా పౌరసేవలు అందించాలని నిర్ణయించామని దానిలో భాగంగా వాట్సాప్ ఈ-గవర్నెన్స్ తీసుకువచ్చామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
Previous Articleస్పెషల్ ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన అథ్లెట్ల బృందాన్ని కలిసి అభినందించిన ప్రధాని మోడీ
Next Article భారీ లాభాల్లో సూచీలు…75 వేల ఎగువకు సెన్సెక్స్

