మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధికి సంబంధించి అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై ఉండవల్లి తన నివాసంలో మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. ప్రముఖ దేవాలయాల తరహాలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణం, వసతి, ఇతర సదుపాయాలు, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని, అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ను తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఇందుకు ఆలయ పండితులతో పాటు నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు.
శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై లోకేష్ సమీక్ష
By admin1 Min Read

