రాజకీయ కార్యక్రమాలు కానీ, ఏ ఇతర కార్యక్రమాలైనా సరే పర్యావరణాన్ని, పరిసరాలను ధ్వంసం చేసేలాగా నిర్వహించకూడదు, వేడుకలు నిర్వహించిన వారు, తరవాత ఆ ప్రాంతాన్ని శుభ్రపరచి స్థానికులకు అందించడమే వారికి అందించే గౌరవంగా జనసేన భావిస్తుందని ఆపార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. “పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం” జనసేన పార్టీ ప్రాథమిక సిద్ధాంతాలలో ముఖ్యమైన సిద్ధాంతమని పునరుద్ఘాటించారు. ఈ సిద్ధాంతాన్ని సమాజంలోనే కాకుండా, పార్టీ చేపట్టే ప్రతీ కార్యక్రమంలో అమలు చేస్తూ కార్యక్రమం నిర్వహించిన వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశుభ్రపరిచే కార్యక్రమాలు చెప్పట్టడం ఎంతో ఆనందాన్నిస్తుందని పేర్కొన్నారు. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఘనంగా జరిగిన జయకేతనం బహిరంగ సభ అనంతరం, సభా వేదికను, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కృషిచేసిన ప్రతీ ఒక్క జనసేన నాయకుడికి, జనసైనికులకు, పారిశుధ్య సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
‘జయకేతనం’ జరిగిన ప్రాంతాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంపై శ్రేణులకు పవన్ అభినందనలు
By admin1 Min Read