తెలంగాణ రాష్ట్రంలో మే నెలలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలు రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు.తెలంగాణకు 2,500 ఏళ్ల చరిత్ర ఉండడంతో పాటు,త్రిలింగ దేశంగా ప్రాచుర్యం పొందిందని ఆమె పేర్కొన్నారు.రామప్ప,వేయి స్తంభాల గుడి,చార్మినార్,గోల్కొండ కోట వంటి విశిష్టమైన కట్టడాలు రాష్ట్ర ప్రాచీనతను తెలియజేస్తాయని అన్నారు.మెడికల్ టూరిజంలో తెలంగాణకు విశేష ప్రాధాన్యత ఉందని,ఇది దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిందని పేర్కొన్నారు.సినిమా,ఆహార రంగాల్లో రాష్ట్రం ప్రత్యేక గుర్తింపును కలిగి ఉందని వివరించారు.మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేయాలనే లక్ష్యంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.ఈ పోటీలు గ్లోబల్ టూరిజాన్ని ఆకర్షించేలా ఉంటాయని ఆమె పేర్కొన్నారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

