విశాఖపట్నం మహా నగరపాలక సంస్థ కొత్త మాస్టర్ ప్లాన్ నాలుగు నెలల్లో తయారు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ మాస్టర్ ప్లాన్ పై సచివాలయంలో అధికారులు, విశాఖ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మే నెలాఖరు నాటికి విశాఖ మెట్రో రైలు టెండర్లు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆర్థిక నగరం విశాఖపట్నం మాస్టర్ ప్లాన్ పై సమీక్షించినట్లు పేర్కొన్నారు. ప్రజలు నేతల అభిప్రాయాలతో నాలుగు నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు తెలిపారు. మెట్రో ట్రైన్ గురించి కూడా చర్చించినట్లు తెలిపారు. టీడీఆర్ బాండ్స్ విషయంలో గతంలో అక్రమాలు జరిగాయని విశాఖలో 600 టీడీఆర్ బాండ్స్ పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని కలెక్టర్ త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ కు ఇబ్బంది లేకుండా రోడ్లు వేస్తామని చెప్పారు. వైసీపీ హాయాంలో మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా డీవియేషన్ జరిగిందని తెలిపారు.
Previous Articleమంత్రి ఫరూఖ్ భార్య కన్నుమూత: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ దిగ్బ్రాంతి
Next Article ఏప్రిల్ 3న ఏపీ మంత్రివర్గ సమావేశం..!