ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.సీఐడీ నమోదు చేసిన కేసులో ఆయనకు ఈ ఊరట లభించింది.పోసాని బెయిల్ పిటిషన్‌పై కోర్టు బుధవారం విచారణ జరిపి తీర్పును వాయిదా వేసింది.చివరకు నేడు విచారణ కొనసాగించి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని, తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కాగా, ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో అరెస్టయిన పోసానిపై ఏపీలో మొత్తం 19 కేసులు నమోదైనట్లు సమాచారం.అవార్డుల అంశంపై సినీ పరిశ్రమలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదుల నేపథ్యంలో ఈ కేసులు నమోదయ్యాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు