ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ ను టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ, ఎలాన్ మస్క్ 2022 అక్టోబర్‌లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత సంస్థలో చాలా మార్పులు చేయగా ప్రస్తుతం ‘ఎక్స్’ పేరుతో కొనసాగుతోంది. ఇక ఇంతకుముందు ఉన్న సంస్థ లోగోను కూడా మార్చారు. గతంలో ఉన్న బ్లూబర్డ్ లోగోను ఎక్స్‌తో రీ బ్రాండ్ చేశారు. కాగా, ఈ ఐకానిక్ బర్డ్ లోగోకు తాజాగా ‘ఆర్ఆర్ ఆక్షన్’ సంస్థ నిర్వహించిన వేలంలో భారీ ధర పలికింది. ఏకంగా 35వేల డాలర్లకు అంటే మన రూపాయల్లో రూ.30 లక్షలకు అమ్ముడైంది. 12 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు, 254 కిలోల బ్లూబర్డ్ లోగోను ఈ భారీ ధరకు అమ్మినట్ల ఆర్ఆర్ ఆక్షన్ తెలిపింది. అయితే, ఈ లోగోను దక్కించుకున్న వ్యక్తి అభ్యర్థన మేరకు అతని వివరాలను వేలం సంస్థ బయటకు తెలపలేదు.
Previous Articleరాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల ఫారం పాండ్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్
Next Article యశ్ ‘టాక్సిక్’ విడుదల తేదీ ఖరారు..!