గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేసి ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడిన వైద్యులను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్య కుమార్ సత్కరించారు. ప్రభుత్వ ఆస్పత్రి అయినా అందుబాటులో ఉన్న వసతులతోనే అరుదైన శస్త్రచికిత్సలు చేసిన వైద్యుల అంకితభావం, నైపుణ్యం గొప్పదని కొనియాడారు. అటువంటి వారిని సత్కరించుకోవడం చాలా సంతోషం కలిగించిందని తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని దానికి వైద్య బృందం నుంచి ఇలాంటి సహకారం లభిస్తుండటం అభినందనీయమన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు ఆధ్వర్యంలో గ్రామాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న వారికి, గ్రామాలను దత్తత తీసుకుంటున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో అకింతభావంతో పనిచేసేలా సిబ్బందని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి హెచ్వోడీల కృషి ప్రశంసనీయమని ఇదే స్ఫూర్తి భవిష్యత్తులోనూ కొనసాగాలని ఆకాంక్షించారు.అంతిమంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే మనందరి లక్ష్యం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనతోనే ఇది సాకారం అవుతుందని మంత్రి పేర్కొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే మనందరి లక్ష్యం: మంత్రి సత్య కుమార్
By admin1 Min Read
Previous Articleఅన్నా క్యాంటీన్ కు రూ.కోటి విరాళం… సీఎం చంద్రబాబుకి అందించిన డాక్టర్ శాంతారావు నార్నే
Next Article సుహాస్ ‘ఓ భామా అయ్యో రామ’ టీజర్ విడుదల