ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేశ్ బాఘెల్ నివాసంలో నేడు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. రాయ్ పూర్, భిలాయ్ లలోని బాఘెల్ నివాసాల్లో సెర్చింగ్ చేపట్టారు. ఉదయం సీబీఐ అధికారులు బాఘెల్ ఇంటికి చేరుకున్నారని, ఆయన నివాసాలతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతల ఇళ్లపైనా రెయిడ్ చేశారని బాఘెల్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ సెర్చింగ్ కు సంబంధించి అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. బాఘెల్ ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా ఈరోజు జరిగిన సీబీఐ సోదాల నేపథ్యంలో ఆయన ఛత్తీస్ ఘడ్ లోనే ఉన్నట్లు బాఘెల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేశ్ బాఘెల్ నివాసంలో సీబీఐ సోదాలు
By admin1 Min Read