మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.ఈ వ్యాఖ్యలపై ముంబై పోలీసులు కమ్రాకు నోటీసులు జారీ చేశారు.అయినప్పటికీ ఆయన తన తీరు మార్చుకోకుండా తాజాగా మరో పేరడీ వీడియోను విడుదల చేశారు.ఈసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశిస్తూ ‘మిస్టర్ ఇండియా’ చిత్రంలోని ‘హవా హవాయి’ పాటను పేరడీ చేశారు. ఈ పాటలో పన్ను చెల్లింపుదారుల సొమ్ము వృథా అవుతోందంటూ విమర్శలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కమ్రా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ముంబై పోలీసులు ఆయనకు మరోసారి నోటీసులు పంపారు. కమెడియన్ తన హాజరుకు వారం రోజుల గడువు కోరినప్పటికీ పోలీసులు దాన్ని తిరస్కరించారు.దీంతో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 35 కింద ఇవాళ రెండోసారి నోటీసులు జారీ చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రిని టార్గెట్ చేసిన కమెడియన్ కునాల్ కమ్రా…!
By admin1 Min Read